అరటితోటలో గంజాయి సాగు.. 750 గ్రాములు స్వాధీనం

కడప జిల్లా, లింగాల: అరటితోటలో గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని డీఎస్పీ మురళి నాయక్ మంగళవారం వెల్లడించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

డీఎస్పీ కార్యాలయంలో సీఐలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. లింగాల మండలం కోమన్నూతల గ్రామానికి చెందిన నడిపి వెంగముని తన అరటితోటలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందన్నారు. సమాచారం మేరకు దాడి చేసి నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు 750 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

గంజాయి సాగు, విక్రయాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ మురళి నాయక్ హెచ్చరించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *