మైదుకూరులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

అమ్మవారి శాలలో మహాత్మా గాంధీకి ఘన నివాళులు
—
మైదుకూరు, అక్టోబర్ 2:
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు మైదుకూరులోని అమ్మవారి శాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సభ ఆర్యవైశ్య యువజన సంఘం, కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, ఆవోపా కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు*.
*
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గాంధీజీ అహింస, సత్యం, శాంతి, సేవా మార్గాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను నేటి తరానికి ఆదర్శంగా తీసుకోవాలని పలువురు పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, సేవాభావం, దేశభక్తిని పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*యెలిశెట్టి వెంకట గురు ప్రసాద్‌కు ఘన సన్మానం*

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ టూరిజం విభాగం కమిటీ వైస్ చైర్మన్‌గా నియమితులైన మైదుకూరుకు చెందిన యెలిశెట్టి వెంకట గురు ప్రసాద్ ను ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఆర్యవైశ్య సమాజానికి, ముఖ్యంగా మైదుకూరు ప్రాంతానికి చెందిన వ్యక్తికి రాష్ట్రస్థాయిలో బాధ్యత లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. టూరిజం విభాగం ద్వారా సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.
గాంధీ జయంతి వేడుకలు, సన్మాన కార్యక్రమం ఒకే వేదికపై నిర్వహించడంతో అమ్మవారి శాలలో సందడి నెలకొంది. ఆర్యవైశ్య ఆర్య వైశ్య సభ అధ్యక్షులు బల్లాన్ని చెన్నకేశప్రసాద్ దొంతు సుబ్రహ్మణ్యం కోటా అశోక్ కుమార్ ఎలిసెట్టి వెంకట గురు ప్రసాద్ దొంతు వెంకట సుబ్బయ్య దరిశ శ్రీనివాసులు సందిపుటి సతీష్ కుమార్ పుట్ట శివ పుట్ట సాయి తులసి సత్యసాయి శంకురి వెంకటరమణ మల్లెముల పెద్ద పుల్లయ్య ఇమ్మిడిశెట్టి సతీష్ బాబు, కర్మలపూడి రెడ్డి భార్గవ్ మాలెపాటి నవీన్ కొప్పరపు సుబ్బారావుయువత, వాసవి క్లబ్ సభ్యులు, ఆవోపా కమిటీ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *