ప్రొద్దుటూరులో సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు.. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
ప్రొద్దుటూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 5న ప్రొద్దుటూరులో పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ పరిశీలించారు.

ప్రొద్దుటూరు–జమ్మలమడుగు బైపాస్ రోడ్డులోని బొల్లవరం ప్రాంతాన్ని సందర్శించిన అధికారులు.. సీఎం పర్యటన సందర్భంగా వేదిక సమీపంలో వాహనాల పార్కింగ్‌కు అనువుగా ఉన్న ప్రాంతాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ తదితర అంశాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించిన అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.
అనంతరం ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాలులో సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో ఎస్పీ సమావేశమయ్యారు. సీఎం పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా చర్యలు, బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఏఎస్పీ విబుకృష్ణ ఐపీఎస్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: