మైదుకూరు: మైదుకూరు మున్సిపాలిటీలోని 25వ వార్డు కౌన్సిలర్‌గా భూమిరెడ్డి నరక్కగారి భాను నందన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారు.
భాను నందన్ కుటుంబానికి రాజకీయ, ప్రజాసేవా రంగాల్లో అనుభవం ఉంది. ఆయన తండ్రి బి.ఎన్. శ్రీనివాసులు గతంలో మైదుకూరు మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. తాతయ్య కందనూరు పుల్లయ్య మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్‌గా సేవలందించగా, అమ్మమ్మ కందనూరు వెంకమ్మ కూడా మాజీ సర్పంచ్‌గా ప్రజలకు సేవ చేశారు.
25వ వార్డు కౌన్సిలర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం భాను నందన్ తన బంధుమిత్రులతో కలిసి మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువా కప్పి, పూలమాలతో సత్కరించారు.
భాను నందన్ ఎన్నిక పట్ల ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వార్డు అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
భాను నందన్ ఏకగ్రీవ ఎన్నికతో 25వ వార్డులో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన పనిచేయాలని స్థానికులు ఆశిస్తున్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: