Tv424x7
Telangana

కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు..

KTR: హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)పై.. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి రూ.2500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హనుమకొండ పోలీసులకు కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు ఫిర్యాదు చేశారు. అయితే హనుమకొండ పోలీసులు ఆ కేసును బంజారా హిల్స్ స్టేషన్‌కు అక్కడి పోలీసులు బదిలీ చేశారు. కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 504,505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు..అసలు కేటీఆర్ ఏమన్నారంటే..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన సికింద్రాబాద్ లోక్‌​సభ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా? బీజేపీ ప్రభుత్వమా? అని అర్థం కావడం లేదన్నారు. సామంత రాజులా రేవంత్ ఢిల్లీకి రూ.2500 కోట్లు కప్పం కట్టారని ఆరోపించారు. దీనికోసం ఆయన అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి.

Related posts

తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డ్: సీఎం రేవంత్

TV4-24X7 News

ఫోన్ ట్యాపింగ్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కీలక కామెంట్

TV4-24X7 News

డిసెంబర్28 నుంచే రూ.500కు గ్యాస్ సిలిండర్ రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు.. మహిళల పేరుతో 70 లక్షలు

TV4-24X7 News

Leave a Comment