ఏపీ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ అవినాష్ రెడ్డి
పులివెందుల మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణపై వైసీపీ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఏపీ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
నాలుగు రోజుల క్రితం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పిటిషన్‌కు అనుబంధంగా మరో పిటిషన్‌ను కోర్టులో సమర్పించారు.
వైసీపీ అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, బూత్ ఏజెంట్లకు తగిన భద్రత కల్పించాలని పిటిషన్‌లో కోరినట్లు సమాచారం. నిన్న చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన వివరాలు, తమ వద్ద ఉన్న ఆధారాలను కూడా ఎంపీ అవినాష్ రెడ్డి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్‌పై ఈ మధ్యాహ్నం విచారణ చేపడతామని ఏపీ హైకోర్టు తెలిపినట్లు సమాచారం. కోర్టు విచారణ అనంతరం ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Save or share this story as a newspaper-style Epaper Clip: