Rajiv Kumar: ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) తరుముకొస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ (Rajiv Kumar)కు సాయిధ కమెండోలతో జడ్-కేటగిరి (Z-category) భద్రతను కేంద్ర ప్రభుత్వం కల్పించింది..ఎన్నికల నేపథ్యంలో సీఈసీకి ముప్పు పొంచి ఉందంటూ కేంద్ర భద్రతా సంస్థల నివేదిక ఆధారంగా కేంద్ర హోం శాఖ తాజా భద్రత కల్పించింది’జడ్’ కేటగిరి భద్రత కింద సెంట్రల్ రిజర్స్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన 40 నుంచి 45 మంది సిబ్బంది సీఈసీ రక్షణ విధుల్లో ఉంటారు. దేశ వ్యాప్తంగా ఆయన ఎక్కడ పర్యటించినా ఆయన వెంట ఈ సిబ్బంది ఉంటారు. 1984 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన కుమార్ 2022 మే 15వ తేదీన భారతదేశ 25 ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఏప్రిల్ 19వ తేదీతో మొదలై 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగునుంది..

previous post