సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం లోని మాందపూర్ గ్రామానికి చెందిన లింగాల సత్తయ్య వారం రోజుల క్రితం గుండె పోటు తో మృతి చెందారు విషయం తెలుసుకున్న స్థానిక మాజీ సర్పంచ్ లింగాల బిక్షపతి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం ఆ కుటుంబానికి ₹ 2000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్తయ్య మృతి చెందడం చాలా బాధాకరం అన్నారు.వారి కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని పేర్కొన్నారు.మనం సంపాదించిన దాంట్లో లేని తృప్తి ఇలాంటి సేవ చేయడం లోనే ఆనందం ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింలు.గ్రామ ప్రజలు లింగాల నర్సింలు. జహంగీర్.విజయ్,నవీన్.గణేష్.పెద్ది రాజు,సాయిలు,రమేష్, మల్లేష్.నరేష్.గువ్వ నర్సింలు.రాజయ్య.యాదగిరి.కనకయ్య.నర్సింలు.అనిల్.రమేష్.యాదగిరి తదితరులు పాల్గొన్నారు

previous post
next post