కడప /మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండల పరిధి ఇడమడక చెక్ పోస్ట్ వద్ద సోమవారం సాయంత్రం దువ్వూరు ఎస్సై శ్రీనివాసులు మరియు సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు ఆళ్లగడ్డ వైపు నుంచి వచ్చిన కారును తనిఖీ చేయగా మూడు లక్షల నగదు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులోని వ్యక్తిని విచారించగా తన పేరు ఎల్లాల మహమ్మద్ పైజల్ అని ఈ డబ్బు ఆర్లగడ్డ నుంచి పొద్దుటూరు తీసుకెళ్తున్నట్లు చెప్పాడని ఎస్ఐ తెలిపారు. డబ్బుకు సంబంధించిన ఎలాంటి రసీదు చూపించకపోవడంతో డబ్బులు తిరుపతి ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పగించినట్లు మైదుకూరు రూరల్ సీఐ శ్రీనాధ్ రెడ్డి తెలిపారు

previous post