శ్రీరామ నవమి సందర్భంగా రేపు ( 17 న) మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో అరుదైన ఘట్టం జరగనుంది.బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం ఆవిష్కృతం కానుంది. 75MM వ్యాసార్ధంతో దాదాపు 6 నిమిషాలపాటు సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

previous post