Tv424x7
National

మద్యం కుంభకోణం కేసులో ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

Bhupesh Baghel: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత భూపేశ్‌ బఘేల్‌పై మద్యం కుంభకోణం ఉచ్చు బిగుస్తోంది. తాజాగా ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో భారీ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్‌ ద్వారా నిందితులు సుమారు రూ.2వేల కోట్లు లబ్ధి పొందినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ తెలిపింది. మద్యం అమ్మకాల వరకు ప్రతి విభాగంలో పెద్ద ఎత్తున్న లంచాలు ఆశచూపి పూర్తి మద్యం సరఫరా వ్యవస్థను అన్వర్‌ తన ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ఈడీ వెల్లడించింది.మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి కేస్‌పై (మద్యం బ్రాండ్ ఆధారంగా) రూ. 75 నుంచి రూ. 150 కమిషన్‌ వసూలు చేయడంతోపాటు ప్రైవేటుగా నకిలీ మద్యం తయారుచేసి, వాటిని ప్రభుత్వ దుకాణాల్లో విక్రయించి 30 నుంచి 40 శాతం కమిషన్‌ పొందాడని ఈడీ ఆరోపించింది. అలా, 2019 నుంచి 2022లో సుమారు రూ. 1,200 నుంచి రూ. 1500 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు గుర్తించింది. 2022లో ఐఏఎస్‌ అధికారి అనిల్‌ తుటేజాపై ఐటీశాఖ దాడులతో ఈ కుంభకోణం వెలుగు చూసింది.

Related posts

ముగిసిన ప్రధానితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

TV4-24X7 News

మణిపూర్‌ పర్యటనకు ప్రధాని మోదీ…ఇందుకేనా..?

TV4-24X7 News

ఉప్పుతో ముప్పు’.. మోతాదుకు మించి వినియోగం – ICMR..!!

TV4-24X7 News

Leave a Comment