ఇంఫాల్:
2023లో మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనల తరువాత తొలిసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మణిపూర్ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
రేపు ఆయన రాష్ట్రంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ప్రధాన మంత్రి చురాచాంద్‌పూర్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే, దాదాపు ₹7,300 కోట్ల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపన కూడా చేయనున్నారు.
ఈ పర్యటనతో రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులకు ఊపిరి లభిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, మోదీ సందర్శనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
అనూష

