Tv424x7
National

13 రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్

న్యూ ఢిల్లీ :-లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ నేటి ఉదయం ప్రారంభమైంది.. ఈ విడత లో 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ను నిర్వహించను న్నారు. వాస్తావానికి 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వ హించాల్సి ఉండగా 88 స్థానాల్లోనే పోలింగ్ జ‌రుగు తోంది. ఎందుకంటే.. మధ్య ప్రదేశ్‌లోని బేతుల్ స్థానం నుంచి బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భలవి ఏప్రిల్ 9న చనిపో యారు. దీంతో అక్కడ జరగాల్సిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశకు మే 7వ తేదీకి వాయిదా వేసింది. .*పొలింగ్ స‌మ‌యం పెంపు ..*ఎండలు, వడగాలుల ప్రభా వం ఎక్కువగా ఉన్నందున బీహార్‌లోని పలు స్థానాల పరిధిలో పోలింగ్ సమయా న్ని పెంచుతున్న‌ట్టు ఈసీ తెలిపింది. బంకా, ఖగారి యా, ముంగేర్, మాధేపురా స్థానాల పరిధిలోని సమ స్యాత్మక ప్రాంతాల్లో సాయం త్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని తొలుత భావించారు. అయితే.. ఎండల కార‌ణం గా ఓటర్ల సౌకర్యం కోసం ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6గంటల వరకు పొడిగిం చారు. ముంగేర్‌లోని 230 పోలింగ్ స్టేషన్లు, ఖగేరియా లోని 299, మాధేపురాలోని 207, బంకాలోని 363 పో లింగ్ స్టేషన్లలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది…

Related posts

ఇజ్రాయెల్‌పై క్లస్టర్‌ బాంబులతో కూడిన క్షిపణులను ప్రయోగించిన ఇరాన్‌..!

TV4-24X7 News

తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ శుభవార్త

TV4-24X7 News

పూరి జగన్నాథుని విగ్రహంలో బ్రహ్మ పదార్థం.. దీని స్టోరీ ఏంటంటే.?

TV4-24X7 News

Leave a Comment