Tv424x7
National

హెలికాప్టర్ ఎక్కుతుండగా కిందపడిన మమతాబెనర్జీ

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. శనివారం తృణముల్‌ కాంగ్రెస్‌ అసన్‌సోల్ లోక్‌సభ అభ్యర్ధి శతృఘ్న సిన్హా మద్దతుగా రోడ్ షోతో పాటు అసన్‌సోల్, కుల్టీలలో ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించనున్నారు..అయితే దీదీ ఇందుకోసం దుర్గాపూర్ నుంచి అసన్‌సోల్‌కు వెళ్లేందుకు హెలికాఫ్టర్‌ ఎక్కారు.హెలికాఫ్టర్‌ లోపలికి ఎక్కిన తర్వాత కాలు జారీ పడ్డారు. సిబ్బంది అప్రమత్తం కావడంతో ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాల నుంచి సురక్షితంగా బయట పడ్డారు. ప్రస్తుతం ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి..

Related posts

ఐబొమ్మ పాత పోస్ట్‌ను కొత్తదిగా చూపిస్తున్న మీడియా ఛానల్స్

TV4-24X7 News

మహిళలకు రూ.3వేలు, ఉచిత బస్సు ప్రయాణం.. రాహుల్‌ హామీ

TV4-24X7 News

పల్స్ పోలియో స్పెషల్ డ్రైవ్ దేశవ్యాప్తంగా ప్రారంభం

TV4-24X7 News

Leave a Comment