Tv424x7
Telangana

కాంగ్రెస్ కు మద్దతిచ్చేందుకు సీపీఎం నేతలు అంగీకరించారు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డితో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు, వీరయ్య భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని సీపీఎం నేతలను ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కోరారు..భువనగిరితో పాటు ఇతర స్థానాల్లో మద్దతు కోరినట్లు చెప్పారు. మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలు వారి ముందు ఉంచినట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు సీపీఎం నేతలు అంగీకరించారన్నారు. దేశంలో ఇండియా కూటమితో కలిసి పని చేయనున్నారని వివరించారు. ఒకట్రెండు విషయాల్లో సీపీఎంతో సందిగ్ధత ఉందని పేర్కొన్నారు. అధిష్ఠానంతో చర్చించి ఆదివారంలోగా ఏకాభిప్రాయానికి వస్తామన్నారు. ఆ పార్టీ సహకారంతో భవిష్యత్తులో ముందుకెళ్తామని చెప్పారు. తమ అభ్యర్థులు బరిలో నుంచి తప్పుకోవాలని సీఎం కోరారని తమ్మినేని వీరభద్రం అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. భాజపా, ఇతర శక్తులను అడ్డుకునేందుకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు..

Related posts

భారీ వర్షం.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికల!!

TV4-24X7 News

మనోజ్‌కు తల్లి షాక్.. పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సంచలన విషయాలు.

TV4-24X7 News

విధ్వంసం తప్పదా..? “మోంధా” తుఫాను ఆందోళన!

TV4-24X7 News

Leave a Comment