కడప /మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో సహా 11 మంది అనుచరులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సోమవారం పోలింగ్ సందర్భంగా చాపాడు మండలం చిన్నగులవలురులో ఇద్దరు టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో ఇద్దరు టీడీపీ ఏజెంట్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో సహా 11 మందిపై చాపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.

previous post