Tv424x7
National

భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగిందీ ఘటన.ఆమెకు ప్రతి రోజూ కుర్‌కురేను చిరుతిండిగా తినడం అలవాటు. భర్త రోజూ రూ. 5 కుర్‌కురే ప్యాకెట్‌ తీసుకొచ్చి ఆమెను సంతోషపెట్టేవాడు.ఒక రోజు ఉత్త చేతులతో ఇంటికొచ్చిన భర్తను చూసిన భార్య తినడానికి రోజు లాగా ఈరోజు కురుకురే ఎందుకు తీసుకు రాలేదని ప్రశ్నిస్తూ,మాట మాట పెరిగి గొడవ జరగడంతో,వెంటనే పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు దంపతులిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇప్పించాలని నిర్ణయించారు. పోలీసుల కౌన్సిలింగ్ తో చివరికి భార్యాభర్తలు ఇద్దరు ఒకటవ్వడం జరిగింది.ఇటీవలి కాలంలో ఇలాంటి చిన్న కారణాలతో విడాకులు కోరుతున్న వారి సంఖ్య బాగా పెరుగుతున్నది.

Related posts

ఉగ్రవాదుల జాబితాలోకి నావల్నీ భార్య

TV4-24X7 News

వేగం పెరగనున్న వందేభారత్ రైలు

TV4-24X7 News

నేడు కోయంబేడులో విజయకాంత్‌ అంత్యక్రియలు

TV4-24X7 News

Leave a Comment