Tv424x7
Andhrapradesh

రాష్ట్రంలో పాలన, పోలీస్ వ్యవస్థ ఉందా? లేదా?: మాజీమంత్రి ప్రత్తిపాటి

రాష్ట్రంలో పాలన, పోలీస్ వ్యవస్థ అసలు ఉందా లేదా అని సూటి ప్రశ్నలు సంధించారు మాజీమంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్రంలో సరైన పాలన వ్యవస్థనే లేదని ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా, దీపక్‌ మిశ్రాలు ఇచ్చిన నివేదికలతో జగన్ ప్రభుత్వం, అతడి ప్రధాన కార్యదర్శి, పోలీస్ యంత్రాంగం తలలు ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారాయన. ప్రజాస్వామ్యంలో కీలక క్రతువైన ఎన్నికల సందర్భంలోనే ఇలా వ్యవహరించారంటే ఇక సాధారణ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల దైన్యం ఏమిటో ఇప్పుడు అందరికీ అర్థం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్తిపాటి. ఈసీ పరిశీలకుల నివేదికలు, ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర డీజీపీ, ప్రధాన కార్యదర్శిలకు సమన్ల నేపథ్యంలో బుధవారం ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు ప్రత్తిపాటి. ఈ సందర్భంగానే ఆయన రాష్ట్రంలో పాలనా యంత్రాంగం పూర్తిగా గాడి తప్పిందని, శాంతిభద్రతలను గాలికి వదిలేశారని తాము చేస్తున్న ఫిర్యాదులకు ప్రస్తుత ఈసీ పరిశీలకుల నివేదికలే మరో తిరుగులేని సాక్ష్యమన్నారు. ఇదే సమయంలో పల్నాడు సహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ రోజు, అనంతరం చెలరేగిన హింసకు బాధ్యులైన వారు అందరు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర డీజీపీ, ప్రధాన కార్యదర్శిలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లను స్వాగతిస్తున్నామన్న ఆయన ఇప్పుడు ఈసీ తీసుకునే చర్యలు భవిష్యత్‌లో కూడా అందరికీ ఒక హెచ్చరికగా ఉండాల ని సూచించారు. పోలింగ్ ముగిసి రోజులు గడుస్తున్న హింసాగ్ని చల్లా రక పోవడానికి అధికార వైకాపా కుట్రలు, క్షేత్రస్థాయి యంత్రాంగం వారి చేతుల్లో కీలుబొమ్మలు గా మారవడం వల్లనే అన్నది బహిరంగ రహస్యమన్నారు ప్రత్తిపాటి. మరీ ముఖ్యంగా పల్నాడులో హింసకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సోదరులు, కాసు మహేశ్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడిల పాత్రలపై అనేక ఆధారా లు ఉన్నప్పటికీ తొలుత పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారన్నారు ప్రత్తిపాటి.

Related posts

జనసేనలోకి వైసీపీ మాజీ మంత్రి..?

TV4-24X7 News

టీడీపీ నేత వంగవీటి రాధాకు అస్వస్థత

TV4-24X7 News

25 లక్షల వరకూ ‘ఆరోగ్యశ్రీ’.. ఇకపై కొత్తగా క్యూఆర్ కోడ్‌తో స్మార్ట్ కార్డులు

TV4-24X7 News

Leave a Comment