కడప/ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని మక్కా మసీదు వీధి, ఖాదర్ హుస్సేన్ మసీదు వీధుల్లో శుక్రవారం రాత్రి పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. కుక్క కరవడంతో గాయాలైన చిన్నారులను తల్లిదండ్రులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని వీధి కుక్కల బారి నుంచి పిల్లలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

previous post