Tv424x7
National

నేడు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు

ఇరాన్:మే 23హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని స్మరించు కుంటూ ఇరాన్ ప్రభుత్వం సంతాప కార్యక్రమాలు ప్రకటించింది. అయితే హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశానికి సమీపంలోని తబ్రిజ్ పట్టణంలో శవపేటికలతో సంతాప యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లదుస్తులతో, ఇరాన్ జెండాలు పట్టుకుని ప్రజలు వేల సంఖ్యలో పాల్గొన్నారు. కాగా ఇవాళ రైసీ అంత్య క్రియలు నిర్వహించను న్నారు. ఆయన పుట్టి పెరిగిన మషాద్ నగరంలో అంత్యక్రియలు నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి భారత్ తరపున అధి కారికంగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ నివాళుల ర్పించనున్నారు. ఈ క్రమం లో ఆయన ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన అధ్యక్షుడు, ఆ దేశ విదేశాంగ మంత్రికి భారత్ తరపున నివాళుల ర్పిస్తారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

Related posts

భద్రతాబలగాలే లక్ష్యంగా.. ఆర్మీ ట్రక్కుపై ఉగ్రదాడి!

TV4-24X7 News

రేపు దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్

TV4-24X7 News

గణేష్ మండపాలకు ఈజీగా అనుమతులు – ఫీజు లేకుండా ఆన్​లైన్​లో అప్లికేషన్​లు

TV4-24X7 News

Leave a Comment