Tv424x7
Andhrapradesh

రాయలసీమ వ్యాప్తంగా వున్న రెసిడెన్షియల్ జూనియర్ కాలేజిలను గుర్తించి గుర్తింపు లేని కాలేజీ పై చర్యలు తీసుకోవాలి -PSYF,TRSF,RSO,RVF

విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కడప ఇంటర్ RJD కార్యాలయం వద్ద నిరసన A.O రామ్ నివాస్ సింగ్ కు వినతిపత్రం అందజేత

రాయలసీమ వ్యాప్తంగా గుర్తింపు లేని కళాశాలలపై రెసిడెన్సి కాలేజీలపై చర్యలు తీసుకోవాలని రాయలసీమ వ్యాప్తంగా ఉన్న జిల్లాల ఆర్ఐవోలు పర్యవేక్షణలో పూర్తిగా విఫలమయ్యారని విద్యార్థి యువజన సంఘం నాయకులు

ప్రగతిశీల విద్యార్థి యువజన సమాఖ్య(PSYF) రాష్ట్ర కన్వీనర్ ఓబులేసు కత్తి, తెలుగు రాష్ట్ర విద్యార్థి సమైక్య (TRSF)రాష్ట్ర కార్యదర్శి ఇండ్ల జయరాజ్ ,రాయలసీమ విద్యార్థి ఆర్గనైజేషన్(RSO) రాష్ట్ర అధ్యక్షుడు జగన్, ఆర్ వి ఎఫ్ (RVF)రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయుడు లు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలలో కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు మినీ కార్పొరేట్ కళాశాల యాజమాన్యాలు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు విచ్చలవిడిగా ఎటువంటి పర్మిషన్స్ గాని సదుపాయాలు గాని లేకుండా రెసిడెంట్షియల్ కాలేజీలను ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుండి వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఒకే గది యందు 10 నుండి 15 మందిని విద్యార్థులను పెట్టి వారికి ఎటువంటి బాత్ రూమ్ సదుపాయాలు కల్పించకుండా నాసిరక భోజనం ఏర్పాటు చేస్తూ లక్షల రూపాయలను దండుకోవడం జరుగుతా ఉంది ఇటువంటి కాలేజీలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాలుగా రాయలసీమ జిల్లాల RIO లకు ఫిర్యాదులు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదు అలాగే నంద్యాల జిల్లాలో నలంద జూనియర్ కళాశాల యాజమాన్యం రెసిడెన్షియల్ నడుపుతూ ఒక విద్యార్థికి శిరోమండం చేసిన ఇంతవరకు చర్యలు తీసుకోవడంలో ఆ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి పూర్తిస్థాయిలో ఫలం చెందారు అలాగే తిరుపతి పట్టణంలో చైతన్య కళాశాల యాజమాన్యాలు నారాయణ కళాశాల యాజమాన్యాలు రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేసి జేఈఈ నీట్ నియో త్రిబుల్ ఐటీ పేర్లతో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేయడం జరుగుతోంది అప్పుడే విద్యాసంవత్సరం పూర్తి కాకముందే అడ్మిషన్లు క్లోజ్ అంటూ ఏర్పాటు చేసి విద్యార్థుల తల్లిదండ్రులను అయోమయానికి గురి చేయడం జరుగుతోంది కర్నూల్ జిల్లాలో ఒకే చోట మూడు కార్పొరేట్ కళాశాలకు సంబంధించిన బ్రాంచ్లను ఏర్పాటు చేసి వారికి తరగతి గదులు కేటాయించడంలో గాని రెసిడెన్షియల్ ఏర్పాటు చేయడంలో గాని సదుపాయాలు కల్పించడంలో యాజమాన్యాలు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం వహించడం జరుగుతోంది అమ్మాయిల ఆత్మహత్యలు జరుగుతున్నా కూడా చర్యలు తీసుకోకుండా కర్నూలు గారు నిర్లక్ష్యం వహించడం జరిగింది ఇలాంటి సమస్యలు రాయలసీమ వ్యాప్తంగా జరుగుతున్న కూడా ఆర్ఐవోలు స్పందించడం లేదు ఇటువంటి అధికారులను పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సదుపాయాలు పర్మిషన్స్ లేని ఫైర్ సేఫ్టీ లేని శానిటేషన్ సేఫ్టీ లేని కాలేజీలను రద్దు చేయాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేసి Aoగారికి డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు ప్రవీణ్,సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్

TV4-24X7 News

ఏపీలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ మెనూలో మార్పు?

TV4-24X7 News

వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌గా కోనేరు హంపి.. అభినందించిన వైఎస్ జగన్

TV4-24X7 News

Leave a Comment