విశాఖపట్నం స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ గురువారం, వన్ టౌన్ నందు ఉన్న శ్రీ స్వామి వివేకానంద సంస్థలో ఉచిత బీపీ, షుగర్ వైద్య పరీక్షలు వివేకానంద సంస్థ ఆశ్రమ వాసులకు, చుట్టుపక్కల వారికి నిర్వహించబడును. ఈరోజు డాక్టర్ సూర్యతేజ పర్యవేక్షణలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్య తేజ మాట్లాడుతూ ప్రతినెలా వైద్య పరీక్షలకు హాజరుకావాలని, సమయానికి మందులు వాడాలని, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం పనికిరాదని ఆయన సూచించారు. అందరూ కూడా ఈ వైద్య సేవలు వినియోగించుకోవాలని సంస్థ అధ్యక్షులు అప్పారావు కోరారు. ఈ వైద్య శిబిరంలో పుండరీ కాక్షయ్య , నాయుడు , కమల ప్రియ, మౌనిక మొదలైన వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
