Tv424x7
Andhrapradesh

32వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టండి కార్పొరేటర్ కందుల నాగరాజు

విశాఖపట్నం విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధి 32వార్డులో యుద్ధ ప్రతిపాదికన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టాలని వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు కోరారు. ఎ ఈ రవికుమార్ తో కలిసి వార్డులో కృష్ణా గార్డెన్స్, నంది వీధి, అల్లిపురం బజారు రోడ్డు, అల్లిపురం, నేరెళ్ల కోనేరు జంక్షన్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. మహిళలు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. వర్షకాలం వస్తున్న దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణమే ఎస్టేమేట్స్ వేసి పనులు చేపట్టాలని కోరారు. కృష్ణా గార్డెన్స్ లో కాల్వలు నిండిపోయి దుర్వాసన వస్తుందడంతో వెంటనే క్లీన్ చేయించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో జీవీఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ కిషోర్, కుమారి, వరలక్ష్మి, శ్రీదేవి, జానకి తదితరులు పాల్గొన్నారు.

Related posts

బట్టలు షాప్ ఓపెనింగ్ ప్రారంభించిన విల్లూరి

TV4-24X7 News

ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

TV4-24X7 News

గుండెపోటుతో మాజీ MLC కన్నుమూత

TV4-24X7 News

Leave a Comment