శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం, గండి క్షేత్రము కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటంతో పాటు వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభిమాని కమలాపురం పట్టణ వాస్తవ్యులు పాలగిరి సుబ్బారెడ్డి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి 1,00,116 విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ షరీఫ్, జూనియర్ అసిస్టెంట్ రవి చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుంద రెడ్డి తెలిపారు

previous post