విశాఖపట్నం వన్ టౌన్ సీహార్స్ వద్ద టిడ్కో ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని దక్షిణ జనసేన నాయకుడు, 39వ వార్డు కార్పొరేటర్ సాధిక్ డిమాండ్ చేశారు. వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ సౌత్ ఇన్చార్జి. మాజీఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ , యూసీడీ అధికారులు సీహార్స్ వద్ద టిడ్కో ఇళ్లలో కేటాయింపులో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. స్థానికులకు తీవ్రఅన్యాయం చేశారని ఆరోపించారు. పేదవర్గాలకు కేటాయించాల్సిన ఇళ్లను మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి తన అనుయాయులకు కేటాయించారని అన్నారు. ఇలా దక్కించుకున్న టిడ్కో ఇళ్లు ఆ లబ్ధిదారులు ఇళ్లు అమ్ముకున్నారని, తక్షణం దీనిపై విచారణ జరపాలని డి మాండ్ చేశారు. సీహార్స్ టిడ్కో ఇళ్ల కేటాయింపులో వైసీపీ ఆక్రమాలను వెలికి తీయాలని డిమాండ్ చేశారు. యూసీడీ అధికారులు వైసీపీ నాయకులతో కలసి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్టు స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బాధ్యులపై చర్యలు దిగాలని కోరారు.
