Tv424x7
Andhrapradesh

కందుల ఆధ్వర్యంలో వీధి వర్తకులకు గొడుగులు పంపిణీ

విశాఖ దక్షిణ నియోజకవర్గం లో నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు సోమవారం వీధి వర్తకులకు, చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ ఎండలో మగ్గిపోతున్న వ్యాపారుల బాధలు చూసి చలించి వారికి సహాయం చేయాలనే దృక్పథంతో వీధి వర్తకులకు అలాగే చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.రైల్వే స్టేషన్ , చలువతోట , ప్రాంతానికి చెందిన వారికి పంపిణీ చేసినట్లు తెలిపారు.మండుతున్న ఎండలు జనాలను ఇబ్బందులు పెడుతున్నాయని చెప్పారు. ఈ గొడుగులు కారణంగా వ్యాపారులకు కాస్త ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా నిస్వార్ధంతో తాను ఈ సేవలు చేస్తున్నట్టు వెల్లడించారు.భవిష్యత్తులో కూడా తన సేవలు కొనసాగుతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి , అదిబాబు, కిషోర్ ,అప్పలరాజు , దాన, సరిత , లక్ష్మి , వర , కుమారి తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాణసంచా విక్రయాలపై నిషేధం:ఈసీ

TV4-24X7 News

కాకినాడలో తిరుమల దర్శనం టికెట్ల పేరుతో మోసం – నకిలీ వీఐపీ టికెట్లు, వంశీ అరాచకం!

TV4-24X7 News

చంద్రబాబు కేసులో ట్విస్ట్

TV4-24X7 News

Leave a Comment