విశాఖపట్నం శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు, విశాఖపట్నం, వన్ టౌన్ నందు ఉన్న గీతా ప్రచార సమితి వ్యవస్థాపకులు ఎండూరి. కృష్ణమూర్తి ని, మట్టపల్లి చలమయ్య తనయులు మట్టపల్లి. హనుమంతరావు , యువ నాయకులు ద్రోణం రాజు. శ్రీవాత్సవ్ చేతుల మీదుగా ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గీతా ప్రసార సమితిలో కోశాధికారిగాను, అధ్యక్షులుగాను, ప్రస్తుతం గౌరవ అధ్యక్షులుగా 25 సంవత్సరాలు సేవ చేశారు, లక్ష మంది విద్యార్థులకు గీతా పారాయణం నేర్పించారు. నిత్యం బాల, బాలికలకు యోగ, గీతా, వేద, గణితం నేర్పించారు.8 గీతా శిక్షణ శిబిరాల్లో 397 మందికి గీతా పారాయణ శిక్షణను ఇచ్చారు. అమెరికా వెళ్ళినప్పుడు ఇండియానా స్టేట్ శివాలయంలో గీతా ప్రథమ అధ్యాయం పై ప్రవచనం చేశారు, అని ఆయన తెలిపారు. సేవా రత్న , గీతా గాన గంధర్వ కృష్ణమూర్తి ని సన్మానించడం మా అదృష్టంగా భావిస్తున్నామని సంస్థ అధ్యక్షులు అప్పారావు తెలిపారు. అనంతరం కృష్ణమూర్తి కి సంస్థ సభ్యులు, ట్యూషన్ విద్యార్థులు పాద పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు గజపతి స్వామి, పైడి రాజు, అప్పలకొండ, బానోజీరావు, నల్ల రాజు మొదలైన వారు పాల్గొన్నారు.
