Tv424x7
Andhrapradesh

ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత బస్సు డేట్ ఫిక్స్

ఏపీ ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారికంగా వెల్లడించారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన వెల్లడైంది. దీంతో ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న మహిళలకు రానే వచ్చేసింది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. దీంతో ఏపీ అధికారులు ఈ రెండు రాష్ట్రాల్లో పర్యటించి పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. ప్రధానంగా జీరో టికెట్ విధానంపై రెండు రాష్ట్రాల్లో అధ్యయనం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, రూట్లకు అనుగుణంగా ఈ పథకాన్ని అమలు చేయాలనే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఓ నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Related posts

ఏపీలో డిఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. రేపటి నుంచి మాక్ టెస్టులు

TV4-24X7 News

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ – ఫిబ్రవరి 12కు వాయిదా వేసిన సుప్రీంకోర్ట్

TV4-24X7 News

ప్రొటెక్షన్ వాచర్ పై ఎలుగుబంటి దాడి..

TV4-24X7 News

Leave a Comment