విశాఖపట్నం రోడ్లు, యుజీడి వ్యవస్థను గత ప్రభుత్వం సర్వనాశనం చేసింది డ్రైనేజ్ సమస్యను వెంటనే పరిష్కరించాలి యుజీడి పనులపై సమీక్ష నిర్వహించాలి ఈరోజు జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు ,దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ తొలి ప్రసంగంలోనే నగర పరిధికి సంబంధించిన, దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను అసెంబ్లీలో ప్రస్తావించారు. గత ప్రభుత్వ కాలంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను నాశనం చేసిందని, వీలైనంత త్వరగా డ్రైనేజీవ్యవస్థ సమస్య పరిష్కరించాలని, అదేవిధంగా యూజీ డి సమక్ష నిర్వహించాలని పు శాఖ మంత్రి ని కోరారు .వర్షాకాలం రావడంతో దక్షిణ నియోజకవర్గం లో డ్రైనేజీ సమస్యలు పునరావృతం అవుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. చిన్న చిన్న వర్షాలకి దక్షిణ నియోజకవర్గంలో చాలా ప్రాంతాలు మునిగిపోతున్నాయని , డ్రైనేజీ వ్యవస్థను ఆధునికరించాలని ఈ సందర్భంగా కోరారు.
