Tv424x7
Telangana

తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ను ప్రారంభించిన సీతక్క

ములుగు జిల్లాలో తొలి కంటైనర్ స్కూల్ ను ప్రారంభించారు మంత్రి సీతక్క. కన్నాయిగూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామంలో రూ.13 లక్షలతో ఏర్పాటు చేసిన కంటైనర్ స్కూల్ ను సీతక్క సెప్టెంబర్ 17న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపి బలరాంనాయక్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ పాల్గొన్నారు.ప్రస్తుతం గుడిసెలో న‌డుస్తున్న పాఠ‌శాల శిధిలావస్థకు చేరుకుంది. అట‌వి ప్రాంతం కావ‌డంతో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులివ్వలేదు. దీంతో ఇక్కడ కంటెయిన‌ర్ పాఠ‌శాల ఏర్పాటు చేశారు సీతక్క. ఈ కంటెయినర్ స్కూ్ల్ 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో ఇద్దరు టీచ‌ర్లు ప‌నిచేస్తుండ‌గా..వారితో పాటు విద్యార్ధులు సౌకర్య వంతంగా కూర్చునే విధంగా కంటేయిన‌ర్ స్కూల్ ను ఏర్పాటు చేశారు.

Related posts

జాతీయ మానవ హక్కుల కమిషన్ లో (ఎన్ హెచ్‌ఆర్‌సి) నర్సింహులపేట ఎస్ఐ సతీష్ పై కేసు నమోదు

TV4-24X7 News

సూర్యాపేట-రాజమండ్రి వరకు నేషనల్ హైవే

TV4-24X7 News

సామాజిక చైత‌న్యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ: హ‌రీష్‌రావు

TV4-24X7 News

Leave a Comment