హైదరాబాద్:సెప్టెంబర్ 21ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు..భేటీ అనంతరం కేబినెట్ నిర్ణయాలను మంత్రులు వివరించారు. హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ ఉండేలా నిబంధనలు సడలించా మని.. హైడ్రాకు అవసర మైన సిబ్బందిని వివిధ విభాగాల నుంచి డిప్యుటే షన్‌పై రప్పిస్తున్నట్టు వెల్లడించారు. 169 మంది అధికారులు, 964 మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని హైడ్రాకు కేటా యించినట్టు తెలిపారు. వీటితోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి, తెలిపారు.

previous post