విశాఖపట్నం నర్సీపట్నం టౌన్ మున్సిపాలిటీలోని బైయపరెడ్డిపాలెం శివారులో మూడు వేల లీటర్ల నాటుసారా పులుపు, తయారి సామాగ్రిని మంగళవారం పోలీసు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సీఐ రేవతమ్మ మాట్లాడుతూ ముందుగా వచ్చిన సమాచారం మేరకు టౌన్ ఎస్ఐ జె. రమేష్, ఇతర సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా. నాటు సారా తయారీకి సిద్ధంగా ఉన్న 3 వేల లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేసి తయారీ సామాగ్రిని, రెండు గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రేవతమ్మ తెలిపారు. నర్సీపట్నం రూరల్, టౌన్ ప్రాంతంలో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మత్తు పదార్థాలు తీసుకోవడం, అమ్మకాలు చేయడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

previous post