Tv424x7
Andhrapradesh

శరన్నవరాత్రి అన్నప్రసాదానికి వాసుపల్లి రూ.10 వేలు విరాళం

విశాఖపట్నం భక్తులకు వడ్డించిన దక్షణ మాజీ ఎమ్మెల్యే గణేష్ కుమార్ మహారాణిపేటలో గల రామ జోగి పేట గల్లీ క్రికెట్ బాయ్స్ నిర్వహించనున్న శరన్నవరాత్రి మహా అన్నదానానికి మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10 వేలు విరాళం అందజేశారు. కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు అక్కడి 29వ వార్డు లో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు లో భాగంగా జరిగిన అన్నదాన కార్యక్రమానికి వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని అనంతరం భక్తులకు స్వహస్తాలతో వడ్డించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా గల్లీ క్రికెట్ బాయ్స్ వైభవంగా నిర్వహిస్తున్న వేడుకలు ఈ ఏడాది కూడా కన్నుల పండువుగా నిర్వహిస్తున్నారన్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని, ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు దక్షిణ నియోజకవర్గ ప్రజలు, విశాఖపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కోరాడ సురేష్ బుల్లెట్ రవి, తమ్మినేని శ్రీను, మహేష్, మూర్తి, అడప శివ వైఎస్ఆర్సిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి**

TV4-24X7 News

ఆ విషయంలో సీఎం జగన్ ను అభినందించాలి: లక్ష్మీనారాయణ

TV4-24X7 News

కూల్డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగిన బాలుడు..చివరికి ఏమైందంటే..?

TV4-24X7 News

Leave a Comment