విశాఖపట్నం శ్రీ స్వామి వివేకానంద సంస్థ వారు వివేకానంద శిష్యురాలు సిస్టర్ నివేదిత జయంతి వేడుకలు 27,28,29 తేదీలలో మూడు రోజులు నిర్వహించనున్నారు మొదటి రోజు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన నాయకులు ద్రోణం రాజు. శ్రీవాత్సవ్ పాల్గొని నివేదిత చిత్రపటానికి పూలమాల సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిస్టర్ నివేదిత వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూ మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ. ఆమె వివేకానంద ప్రియ శిష్యురాలు. మహిళా విద్యాభివృద్ధి కోసం ఆమె ఎంతో కృషి చేశారు. నివేదిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడింది అని అర్థం.1899లో కలకత్తా వాసులకు ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు తన శిష్యులత కలిసి వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించారు, మానవసేవే – మాధవ సేవగా మనం కూడా ఆ మార్గంలోనే సేవలు అందిస్తున్నాం అని ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సంధ్య ఏజ్ కేర్ ఫౌండేషన్ సంస్థ సభ్యులు పుండరీ కక్షయ్య ,పి . సత్యవంతరావు, రామకృష్ణ , సంస్థ సభ్యులు మరియు ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు.
