విశాఖపట్నం కేజీహెచ్ లో హరే కృష్ణ మూవ్ మెంట్ టచ్ స్టోన్ చారిటీస్ వారి సౌజన్యంతో భోజనం నూతన భోజనం సౌకర్యం కౌంటర్ ను దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేజీహెచ్ విచ్చేసిన శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ కి సూపర్డెంట్ డాక్టర్ శివానంద, హరే కృష్ణ మూవ్మెంట్ పెద్దలు సాదరంగా స్వాగతం పలికారు. రోగుల సౌకర్యార్థం హరే కృష్ణ మూమెంట్ వారు ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని అన్నారు. కేజీహెచ్ లో నూతన భవనాల తో పాటు మరిన్ని సేవలు అందించుటకు స్థానిక శాసనసభ్యులు గా కృషి చేస్తానని అన్నారు.అనంతరం ఎమ్మెల్యే సూచన మేరకు వెంకటపతి రాజు 10 వేల రూపాయల చెక్ ను వంశీకృష్ణ చేస్తులమీదుగా నిర్వాహకులను అందజేశారు.కార్యక్రమంలో కేజీహెచ్ సూపర్ఇండెంట్ డాక్టర్ శివానంద, ప్రిన్సిపాల్ రాజు, పెద్దలు దాస్, స్థానిక కార్పొరేటర్ అప్పల రత్నం, కూటమి నేతలు శివ ప్రసాద్ రెడ్డి , యజ్ఞశ్రీ , సిఎం రమణ, గాయత్రి ,జోగి రాజు , హరే కృష్ణ మూవ్మెంట్ పెద్దలు, కేజీహెచ్ సిబ్బంది పాల్గొన్నారు.

