173 మందికి రివార్డులను అందజేసిన సి.పి డా. శంఖబ్రత బాగ్చి
విశాఖపట్నం సిబ్బంది సంక్షేమం తో పాటుగా వారు అందించిన సేవల యందు ప్రతిభను గుర్తిస్తూ, ఉన్నతాధికారుల సమక్షంలో 173 మందికి రివార్డులను అందజేసిన నగర పోలీసు కమీషనర్, మంగళవారం నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రత బాగ్ని, ఐ.పి.ఎస్., ప్రతీ నెలా నిర్వహించే క్రైమ్ రివ్యూ మీటింగ్ నందు ఈ నెలకు గానూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది సేవలను ప్రోత్సహిస్తూ 173 మందికి రివార్డ్ మంజూరు ఆర్డరును అందజేయడం జరిగినది. నగర పోలీసు శాఖ నందు హోంగార్డు నుండి సిఐ స్థాయి అధికారుల వరకూ వారు నిర్వహిస్తున్న విధులకు తగ్గా గుర్తింపు ఇస్తూ, ప్రతి నెలా ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి తగు రివార్డులు అందజేసి, వారు సమర్దవంతముగా విధులు నిర్వహిస్తూ తోటి సిబ్బందికి ప్రేరణ ఇస్తూ అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం మరింత సురక్షితముగా ఉండే దిశగా సిపి చర్యలు తీసుకున్న విషయం విధితమే. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ నగరం గుండా రవాణా అవుతున్న గంజాయిని సీజ్ చేసిన పలు కేసులలో, బాంగ్ చాక్లెట్లు అమ్మకం అడ్డుకొని నిందితుడిని అరెస్టు చేసిన కేసులో, చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువులను రికవరీ చేసి, నిందితులను అరెస్టు చేసిన పలు కేసులలో, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పేరుమోసిన నేరస్తులను అరెస్టు చేయడంలో ముఖ్యపాత్ర పోషించిన కేసులో, సైబర్ క్రైమ్ కేసులో, చిన్న పిల్లల రక్షణ కేసులో నిందితుడిని అరెస్టు చేసిన కేసులో, పోలీస్ మెన్ వెయిటింగ్ హాల్ నిర్మాణం నందు భాగస్వామ్యం అయిన సిబ్బందికి మరియు ఉత్తమ ప్రతిభ కనబరిచిన 173 మంది హోం గార్డు నుండి సీ.ఐ వరకూ గల సిబ్బందికి రివార్డులు మంజూరు చేసి, సిబ్బంది అందరూ ప్రేరణ చెంది మరింత మెరుగ్గా విధులు నిర్వర్తించేలా ఈ రోజు నెలవారీ నిర్వహించే క్రైమ్ మీటింగ్ కు ముందు నగర పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో రివార్డు మంజూరు ఆర్డరును ఇవ్వడం జరిగినది. విశాఖ నగరంలో ముందెన్నడూ లేని విధముగా స్వయంగా సిపి తమ ప్రతిభను గుర్తించి, ఉన్నతాధికారుల సమక్షంలో ఈ రివార్డులు అందజేయడం పట్ల సిబ్బంది అందరూ విధులు మరింత సమర్ధవంతముగా నిర్వహించడానికి ఇది ఎంతో ప్రేరణగా ఉందని తెలుపుతూ సిపి డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., కి తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.