Tv424x7
Telangana

బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనల వేళ పోలీసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

హైదరాబాద్: రాష్ట్రంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనల వేళ పోలీసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‎ల బడ్జెట్ రూ.182.48 కోట్ల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంగళవారం (అక్టోబర్ 29) ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పోలింగ్ సిబ్బందికి సరెండర్ లీవ్‎ల బడ్జెట్ రూ.182.48 కోట్ల మొత్తాన్ని మంజూరు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. సీఎం, డిప్యూటీ నిర్ణయానికి అనుగుణంగా పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‎లకు సంబంధించిన బడ్జెట్‎ను ప్రభుత్వం భారీ స్థాయిలో విడుదల చేసింది. ఎంతోకాలంగా పోలీస్ సిబ్బంది ఎదురుచూస్తున్న సరెండర్ లీవ్‎లకు సంబంధించిన బడ్జెట్‎ను విడుదల చేయడంపై పోలీస్ అధికార సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మరోవైపు మిగిలిన బకాయిలను దశలవారీగా త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Related posts

ఇంద్రవెల్లిలోనే రేవంత్ మొదటి సభ ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా: కే కేశవరావు

TV4-24X7 News

తెలంగాణ దివాలా తీసిందంటున్న కాంగ్రెస్‌కు ఆర్‌బిఐ నివేదిక చెంపపెట్టు లాంటిది.!!

TV4-24X7 News

Leave a Comment