మదనపల్లి రెవెన్యూ ఫైల్స్ దగ్ధం కేసులో ఆర్డీఓగా పనిచేసిన మురళీ ఆస్తులపై రెండో రోజు కొనసాగుతున్న ఏసీబీ సోదాల్లో దాదాపు 35 కు పైగా ఆస్తులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా పక్క రాష్ట్రం కర్ణాటకలోనూ ఆస్తులు ఉన్నట్లు తేల్చారు. బెంగళూరు, పలమనేరు, మదనపల్లిల్లో ఇల్లు, తిరుపతి పరిసరాల్లో 20 కి పైగా ప్లాట్లు, ఆర్‌సీపురంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి, వీ కోటలో రెండు పౌల్ట్రీ ఫామ్స్, 5 ఎకరాల మామిడి తోట, వాయల్పాడు లో వ్యవసాయ భూమి, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట వ్యవసాయ భూమి, నెల్లూరు లో స్టోన్ హోస్ పేట లో ఇంటి స్థలాలు ఉన్నట్లు గుర్తించారు.మరోవైపు అన్నమయ్య, సత్యసాయి జిల్లాలోనూ మురళి ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ భావిస్తోంది. ఇవీకాకుండా 700 గ్రాముల గోల్డ్, 10 కి పైగా బ్యాంక్ ఖాతాలు, రెండు బ్యాంకు లాకర్స్ ఉన్నట్లు చెబుతున్న ఏసీబీ అధికారులు మురళీ స్నేహితుడు చిత్తూరు జిల్లా ఇనాం డీటీ శేషగిరి రావు, సర్వేయర్ చిట్టిబాబు, మదనపల్లిలో వీఆర్వో శేఖర్ ఇళ్ళలోనూ సోదాలు కొనసాగిస్తున్నారు. వందల కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పేరుతో మురళీ ఆస్తులు ఉన్నట్లు చెబుతున్నారుశనివారం(నవంబర్ 9) నుంచి ఏక కాలంలో రంగంలో దిగిన 14 టీంలు 5 జిల్లాల్లో సోదాలు కంటిన్యూ చేస్తోంది. తిరుపతిలో నాలుగు చోట్ల, మదనపల్లి, పలమనేరు, వి కోట, కడప, రాయచోటి నెల్లూరులో ఏసీబీ దాడులు కొనసాగిస్తోంది.
