Tv424x7
Andhrapradesh

సమిష్టి స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కొల్లి

విశాఖపట్నం సమిష్టి స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం 39వ వార్డు పరిధి కన్వీర్ బెల్ట్, పద్మా నగర్ అంగన్వాడి కేంద్రాల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వచ్ఛంద సేవా సొసైటీ అధ్యక్షురాలు కొల్లి సింహాచలం చేతుల మీదుగా స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కన్వర్ బెల్ట్ అంగన్వాడి కేంద్రం, పద్మా నగర్ అంగన్వాడి కేంద్రంల్లో పిల్లలకు ఆటలు పోటీలు నిర్వహించి… విజయం సాధించిన పిల్లలకు బహుమతులను అందజేశారు. అనంతరం అంగన్వాడి పిల్లలకు చాక్లెట్స్ అందించారు. ఈ కార్యక్రమాల్లో సమిష్టి స్వచ్ఛంద సేవా సొసైటీ ప్రతినిధులు రమణమ్మ, పైడిరత్నం, అనిల్, మణి, అంగన్వాడి టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

1132 మందికి పోలీసు పతకాలు.. తెలంగాణకు 20, ఏపీకి 9

TV4-24X7 News

ఏ నోట విన్న నారాయణ నామస్మరణమే

TV4-24X7 News

ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి పెంపు

TV4-24X7 News

Leave a Comment