Tv424x7
Andhrapradesh

ఏ నోట విన్న నారాయణ నామస్మరణమే

సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు

విశాఖపట్నం ఇసుక కొండ బాబాజీ కొండ పై వేంచేసియున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుక మంగళ ధ్వని వేద మంత్రములతో అంగరంగ వైభవంగా జరిగింది . శ్రీ పాంచరాత్ర ఆగమ సంప్రదాయంలో ఆలయ అర్చకులు ఫణిహారం నరసింహచార్యులు స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు , అర్చనలు , కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు . ఇటు ఘాట్ రోడ్ నుండి అటు కేజీహెచ్ నుండి వేలాది సంఖ్యలో భక్తుల తరలివచ్చి క్యూ లైన్ల ద్వారా ధ్వజస్తంభాన్ని మ్రొక్కి అనంతరం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు . వెయ్యి మందికి పైగా దంపతులు పాల్గొని భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని నిర్వహించుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు . వ్రతంలో పాల్గొన్న దంపతులకు శేష వస్త్రం ప్రసాదం అందజేసి వేద ఆశీర్వచనం చేశారు . శ్రీమన్నారాయణ నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారు మ్రోగింది . భక్తులు పూర్ణ మార్కెట్ మీదగా నూతనంగా నిర్మించిన ఘాట్ రోడ్ ద్వారా అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవడం విశేషం.

Related posts

ఏపీలో వర్షాలపై సీఎం చంద్రబాబు దృష్టి… విదేశాల్లో ఉన్నా రాష్ట్ర ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యం!

TV4-24X7 News

తిరుమల చక్రస్నానం ఏర్పాట్లపై టిటిడి తనిఖీ!

TV4-24X7 News

రేషన్ బండ్ల కష్టాలకు చెక్ – నాదెండ్ల ప్రయత్నం !

TV4-24X7 News

Leave a Comment