యూఏఈ పర్యటనలో ఉన్నప్పటికీ రాష్ట్రంపై అప్రమత్తతతో ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
🌧️ నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉందని నివేదికలు అందగా,
ఆ జిల్లాల యంత్రాంగాన్ని తక్షణమే అప్రమత్తం కావాలని ఆదేశాలు జారీ చేశారు.
🚨 ప్రాణ–ఆస్తి నష్టం జరగకుండా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని సూచన.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ఆదేశించారు.
👮♂️ రెవెన్యూ, విపత్తు నిర్వహణ, పోలీస్, జలవనరులు, మున్సిపల్, విద్యుత్ శాఖల అధికారులు
పూర్తి సమన్వయంతో పని చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.
🏥 వర్షాల అనంతరం అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని,
ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
📞 సీఎంకి అధికారులు నివేదికలు సమర్పిస్తూ — ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
🌍 మరోవైపు, దుబాయ్ పర్యటన పూర్తిచేసిన సీఎం చంద్రబాబు అబుదాబి బయలుదేరారు.
తనతో పాటు మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, టీజీ భరత్, ఉన్నతాధికారులు ఉన్నారు.
అబుదాబిలో జరగనున్న తొమ్మిది కీలక సమావేశాల్లో పాల్గొని పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు.

