Tv424x7
Andhrapradesh

ఈ నెల 13న అనంతకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్… ?

ఏపీ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 13. ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన అనంతపురం నుంచి సమర శంకారం పూరించేందుకు వైయస్ జగన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశారు రైతులు సమస్యలపై నిర్వహించే అనంతపురంలో నిర్వహించే భారీ ప్రదర్శనలో పాల్గొని రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించే విధంగా ఒత్తిడి తేవాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే వైసిపి ఆధినేత వైఎస్ జగన్ జిల్లా పర్యటన సంబంధించి అధికారికంగా ఎవరు ప్రకటించలేదు.. వైసీపీ జిల్లా నేతలు శనివారం ఇక్కడ విలేకర్ల సమావేశం నిర్వహించినప్పటికీ ఆ సమావేశంలో వైయస్ జగన్ జిల్లా పర్యటన సంబంధించి ఎవరు ప్రకటించలేదు.. ఇదిలా ఉండగా ఈనెల 13వ తేదీన రైతుల సమస్యలపై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వైసివి ప్రదర్శన నిర్వహించి ఆయా జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించిన విషయం తెలిసిందే. రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర, రైతుకు 20,000 పెట్టుబడి సాయం, పంటల బీమా పునరుద్ధరణ తదితర డిమాండ్లపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. గత బుధవారం తాడేపల్లిలో వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయిలోఅన్ని జిల్లాల వైసీపీ అధ్యక్షులు, ఇతర పార్టీ నేతలతో సమావేశము నిర్వహించి భవిష్యత్తులో చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా ఈనెల 13వ తేదీన రైతు సమస్యలపై జిల్లా కేంద్రాల్లో ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని, డిసెంబర్ 27 తేదీన రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు, జనవరి 3న ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవన బకాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు వైసీపీ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు వైసిపి నేతలు, కార్యకర్తలు సమావేశం చేస్తున్నారు. కాగా అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో శనివారం వైసిపి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, వైసిపి కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈనెల 13న రైతు సమస్యలపై నిర్వహించే ర్యాలీలో రాష్ట్రంలో కూటమి భాగస్వామ్య పార్టీలు కాకుండా అన్ని పక్షాలు, మేధావులు, రైతు సంఘాలు పాల్గొనాలి విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది అన్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం. లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో కిసాన్ రైలును పునరుద్ధరించాలి. వైసీపీ హయాంలో కిసాన్ రైలు 50 శాతం సబ్సిడీతో వస్తే.. ఇప్పుడా పరిస్థితి లేదు అని చెప్పారు. అనంతపురం జిల్లాలో పండ్ల తోటలు అధికం.

Related posts

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ..

TV4-24X7 News

ఎట్టకేలకు మిథున్ రెడ్డికి భద్రత పెంపు

TV4-24X7 News

పులివెందులలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

TV4-24X7 News

Leave a Comment