Tv424x7
Andhrapradesh

ఎంత బతిమాలినా జీతం డబ్బులు ఇవ్వలేదు…అందుకే బంగారు నగలు అపహరించా

కడప /ప్రొద్దుటూరు :మహిళ మెడలో బంగారు లాక్కెళ్లిన నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు.12 తులాల బంగారు నగలు, బైక్ స్వాధీనం- అరెస్టు వివరాలను మీడియాకు వెల్లడించిన డిఎస్పీ భావన.

ఈ రోజు (ఆదివారం) తెల్లవారు జామున టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభావతి అనే మహిళపై దాడి చేసి బంగారు నగలు అపహరించిన ఘటనలో ఆర్ట్స్ కాలేజి రోడ్డుకు చెందిన రసూల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రొద్దుటూరు పాత బస్టాండు సమీపంలో సుబ్బయ్య జనరల్ స్టోర్ నిర్వహించేవాడు. గత రెండేళ్లుగా రసూల్ దుకాణంలో గుమాస్తాగా పని చేసేవాడు. ఈ క్రమంలో తనకు ఆరోగ్యం సరిగా లేనందున అతను జనవరిలో దుకాణంలో మానుకున్నాడు. డిసెంబర్ నెలకు సంబంధించిన జీతం ఇవ్వమని రసూల్ అడుగుగా ఈ రోజిస్తా.. రేపు ఇస్తానంటూ సుబ్బయ్య కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో తన అవసరానికి డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన సుబ్బయ్యను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని రసూల్ భావించాడు. ఈ క్రమంలో ఆదివారం వేకువ జామున సుబ్బయ్య భార్య ప్రభావతి ఇంట్లో ఒంటరిగా ఉండగా ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను అపహరించుకొని రసూల్ పారిపోయాడు. నిందితుడిని 2 టౌన్ బైపాస్ రోడ్డులో ఆదివారం సాయంత్రం సిఐ యుగంధర్ బాబు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 12 తులాల బంగారు నగలు, బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కేవలం 12 గంటల్లో కేసును ఛేదించిన సిఐ, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు నాయక్, B. మహబూబ్ బాషా, V. బాబా ఫక్రూద్దీన్ లను డిఎస్పీ భావన అభినందించారు.

Related posts

రాయవరం రమణమ్మ మృతి కి రెడ్యo సోదరుల సంతాపం

TV4-24X7 News

కెమెరా జర్నలిస్టు ఉదయ్ కు ఆర్థిక సాయం చేసిన వాసుపల్లి

TV4-24X7 News

వాస్తవాలు బయటపెట్టిన వైఎస్ వివేకా కూతరు సునీత

TV4-24X7 News

Leave a Comment