Tv424x7
Andhrapradesh

జగన్ ఎంతకైనా తెగిస్తారు… జాగ్రత్త: చంద్రబాబు

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కొందరిని అరెస్ట్ చేసిన సీబీఐకల్తీ నెయ్యి గురించి మనం మాట్లాడితే జగన్ తప్పుబట్టారన్న చంద్రబాబుతాను చెప్పిందే నిజమని నిరూపించేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తారని వ్యాఖ్య తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యికి సంబంధించి కొందరిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నారని అప్పట్లో మనం చెప్పిన విషయం… ఇప్పుడు సీబీఐ అరెస్టులతో తేటతెల్లమయిందని చెప్పారు. కల్తీ నెయ్యి గురించి మనం మాట్లాడితే వైసీపీ అధినేత జగన్ తప్పుబట్టారని విమర్శించారు. నెయ్యి సరఫరాకు సంబంధించి వైసీపీ హయాంలో టెండర్లు పిలిచారని… కొందరికి అనుకూలంగా నిబంధనలకు సడలించారని చంద్రబాబు ఆరోపించారు. అందుబాటులో ఉన్న మంత్రులతో నిన్న చంద్రబాబు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ… అక్రమాలు బయటపడిన తర్వాత కూడా నెయ్యి సరఫరాలో అక్రమాలు లేవంటూ జగన్ దుష్ప్రచారానికి యత్నించారని అన్నారు. తాను చెప్పిందే నిజమని నిరూపించేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తారని… జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు, మంత్రులు అభిప్రాయపడ్డారు. బాబాయ్ హత్యను, కోడికత్తి డ్రామాను, గులకరాయి డ్రామాను కూడా టీడీపీపైకి నెట్టివేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. జగన్ నాటకాలపై అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సహా మంత్రులు అభిప్రాయపడ్డారు.

Related posts

విజయవాడలో ఆశా వర్కర్ల భారీ ధర్నా

TV4-24X7 News

ప్రకాశం బ్యారేజ్ కు మొదలైన వరద ఉధృతి

TV4-24X7 News

మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూభూషణ్

TV4-24X7 News

Leave a Comment