Tv424x7
Crime News

రంగరాజన్ పై దాడి కేసు… విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!

చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై ఇటీవల దాడి22 మందిపై కేసుప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా ఆరుగురు నిందితులు అరెస్ట్పరారీలో 16 మంది నిందితులు వెలుగులోకి రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలు!చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 16 మంది నిందితులు పరారీలో ఉన్నారు. రామరాజ్యం సంస్థ వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డిపై అబిడ్స్, గోల్కొండ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రంగరాజన్ పై దాడి కేసులో పోలీసులు మొత్తం 22 మందిని నిందితులుగా చేర్చారు. నిందితుల రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీరరాఘవరెడ్డి విచారణలో నేరాన్ని అంగీకరించాడు. గత జనవరిలో వీరరాఘవరెడ్డి అర్చకుడు రంగరాజన్ ను కలిశాడు. వీరరాఘవరెడ్డి ప్రతిపాదనకు రంగరాజన్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో, నిందితులంతా జనవరి 25న పెనుగొండ ఆలయంలో కలుసుకున్నారు. ఫిబ్రవరి 4న మరోసారి దమ్మాయిగూడలో సమావేశమయ్యారు. తమ మాట వినకపోతే రంగరాజన్ పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 7న వారు రంగరాజన్ ఇంటికి వెళ్లారు. తాము చెప్పినట్టు చేయకుంటే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక, రంగరాజన్ పై దాడిని వీడియో చిత్రీకరించిన నిందితులు… ఆ వీడియోలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు.

Related posts

కాలేజ్ భవనం పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య కారణమేంటి..?

TV4-24X7 News

ఎండపల్లి గుట్టలో మట్టిదందా

TV4-24X7 News

రౌడీ షీటర్ పప్పీ హత్య నిందితులను పట్టుకున్న పోలీసులు

TV4-24X7 News

Leave a Comment