Tv424x7
Crime News

ఎండపల్లి గుట్టలో మట్టిదందా

ఎండపల్లి గుట్ట ప్రాంతం ఆంధ్రా-తెలంగాణరాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. ఇక్కడి నుంచిరెండు కిలోమీటర్ల దూరంలోనే ఆంధ్రా ప్రాంతగ్రామాలున్నాయి. ఈ మట్టిని ఆంధ్రాలోని పలుప్రాంతాలకు తరలించి ఆ మ్ముతున్నారు.అలాగే మధిర పట్టణంలో కూడా విక్రయిస్తున్నారు. టిప్పుకు రూ.8వేల చొప్పున మట్టిని ఆ మ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలువినిపిస్తున్నాయి. స్థానిక రైతులు కొంతమందిఅదేమిటని ప్రశ్నిస్తే రోడ్ల నిర్మాణాలకు మట్టినితరలిస్తున్నామని సమాధానమిస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండపల్లిగుట్ట ఉత్తరభాగం వైపు భారీ ఎత్తున గతంలోఎన్నడూలేనివిధంగా మట్టి తవ్వకాలు జరిగాయి.ఎండపల్లి గుట్టలో మట్టి తవ్వకాలు చేస్తున్న ఎక్స్వేటర్ దృశ్యంహద్దులు దాటి తవ్వకాలు…ఎండపల్లి గుట్టలో హద్దులు దాటి ఇతరప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా తవ్వకాలు చేపడుతున్నారు. సామాన్యుడు ట్రక్కు మట్టిని సొంతింటికి అవసరాలకు తీసుకుంటేనే నానా ఇబ్బందులు పెట్టే అధికారులు కనీసం మట్టి తవ్వకాలపై సరైన పర్యవేక్షణ చేయకపోవడంతో పెద్దఎత్తున ఆక్రమంగా మట్టి తరలివెళ్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లోనైతే పెద్ద సంఖ్యలో టిప్పర్లలో ఆంద్రాప్రాంతానికి చెందిన గంపలగూడెం, తిరువూరు.మండలాలకు మట్టి తరలివెళ్లిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి మట్టిని తరలిస్తున్నఆక్రమార్కులను కట్టడి చేయాలని స్థానికులు,కోరుతున్నారు.

Related posts

రెండు రోజుల పాటు శవానికి ట్రీట్మెంట్ .. హెల్త్ మినిస్టర్ సీరియస్..!!

TV4-24X7 News

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్ట్ కీలక ఆదేశం

TV4-24X7 News

5.3 కోట్ల మోసం కేసులో ఐఆర్డీఏఐ అసిస్టెంట్ మేనేజర్ అరెస్టు..

TV4-24X7 News

Leave a Comment