రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయి.రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్‌కు వల్లభనేని వంశీ అరెస్ట్ అద్దం పడుతోంది. వంశీపై ఎలాంటి తప్పు చేయలేదని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధనే చెప్పారు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. పట్టాభిని సీఎం చంద్రబాబే పంపించి గన్నవరంలో గొడవ సృష్టించారు. పట్టాభి, ఆయన అనుచరులు కలిసి ఓ ఎస్సీ నేతపై దాడి చేశారు. మంగళగిరికి సత్యవర్ధన్‌ను పిలుపించుకొని మరో ఫిర్యాదు చేశారు.టీడీపీ ప్రభుత్వం రాగానే వల్లభనేని వంశీని టార్గెట్ చేయడం మొదలెట్టారు. కేసు మళ్లీ రీఓపెన్ చేశారు. సత్యవర్ధన్ అనే వ్యక్తి నుంచి మరోసారి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్‌మెంట్‌లో కూడా వంశీ తప్పు లేదని చెప్పారు. గన్నవరం టీడీపీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశారని వంశీపై సీఎం చంద్రబాబు మరో తప్పుడు కేసు పెట్టారు. టీడీపీ కార్యాలయం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినదని మరో కేసు ఫైల్ చేశారు. టీడీపీ కార్యాలయం తగలబడింది లేదు, ఆ కార్యాలయం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినదని కాదు.వల్లభనేని వంశీకి బెయిల్ రాకూడని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టించారు. మరో 44 మంది వైసీపీ నేతలపై కేసులు పెట్టారు. నెలల తరబడి బెయిల్ రాకుండా సీఎం చంద్రబాబు అడ్డుకుంటున్నారు.పిడుగురాళ్లలో 33 కార్పొరేటర్లు వైసీపీనే గెలిచింది. అయినా వైస్ చైర్మన్ అని టీడీపీ ప్రకటించుకుంది. పిడుగురాళ్లలో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. తునిలో కూడా 30కి 30 వైసీపీనే గెలిచింది. వైసీపీ వాళ్లపై దౌర్జన్యం చేసే అవకాశం లేకపోతే ఎన్నికను వాయిదా వేస్తున్నారు. పాలకొండలోనూ ఇలానే చేస్తున్నారు. పోలీసులు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఎల్లకాలం టీడీపీనే అధికారంలో ఉండదు. అన్యాయాలు చేసిన వారిని చట్టం ముందు బట్టలూడదీసి నిలబెడతాం.వైస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

previous post