విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం, 31వ వార్డ్, బొడ్డునాయుడు తోటలో నివాసముంటున్న ఈశ్వరరావు అనే వ్యక్తి చెరుకురసం అమ్ముకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవలే అనారోగ్యంతో (లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కే జి హెచ్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకొని ప్రస్తుతం ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్న విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న 31వ వార్డ్ తెలుగుదేశం పార్టీ యువనాయకులు బత్తిన నవీన్ కుమార్ వెంటనే స్పందించి ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి పండ్లు, చికిత్స కొరకు కొంత ఆర్థిక సహాయం చేసి తనకు అన్ని విధాలుగా అండగా ఉంటానని దైర్యం చెప్పారు. వారితో పాటు అర్జి శంకర్రావు, పల్లా నగేష్, యాసిన్, అర్జి రాజేష్, బత్తిన మణికంఠ, స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.
