అమరావతి :ఏపీలో గత ప్రభుత్వం ప్రారంభించిన 294 హైస్కూల్ ప్లస్లలో ఇంటర్ ను ఈ ఏడాదీ కొనసాగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో పనిచేసే టీచర్లకు అక్కడే కొనసాగేలా లేదా బదిలీ కోరుకునేలా అవకాశం కల్పించింది. మరో 210 చోట్ల ఇంటర్ విద్యను తిరిగి ఇంటర్మీడియట్ శాఖకు అప్పగించనుంది. అందులోని టీచర్లను వెనక్కు తీసుకుని వారిని ఇతర స్కూళ్లలో నియమించనుంది. అలాగే 900 హైస్కూళ్లలోప్రాథమిక పాఠశాలల ఏర్పాటుకు త్వరలో అనుమతులు ఇవ్వనుంది.

previous post