ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఆర్థిక రుణాలు సైట్ ఆన్ లైన్ ప్రారంభమైనది. నేటి నుంచి మే నెల 10 వ తేది వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు:
1) లబ్ధిదారుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి., కుల ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి.
2) లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ కు చెంది ఉండాలి.
3) లబ్ధిదారుల వయోపరిమితి 21 నుంచి 50 ఏళ్లు.
4) లబ్ధిదారుడు దారిద్య్రరేఖకు దిగువన (బిపిఎల్) కేటగిరీ కింద ఉండాలి.
5) స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి లబ్ధిదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
6) లబ్ధిదారునికి జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ/ ఎం.ఫార్మసీ ఉండాలి.కావాల్సిన పత్రాలు1. ఆధార్ కార్డు ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్.2. రేషన్ కార్డు3. కులం మరియు ఆదాయ ధ్రువీకరణ పత్రం4. రవాణాకు సంబంధించి అయితే డ్రైవింగ్ లైసెన్స్.